రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పిస్తాం : జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్

*రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యం*

* టీడబ్ల్యూజేఎఫ్ వినతిపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్ఫందన

* మంచి ఆలోచనని టీడబ్ల్యూజేఎఫ్ కు కలెక్టర్ అభినందనలు

* అదనపు కలెక్టర్ శ్రీజాకు జాబితా ఇవ్వాల్సిందిగా సూచన

ఖమ్మం; ఏప్రిల్ 2; 2025:

రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఐడీవోసీలో బుధవారం అందజేసిన వినతిపత్రంపై కలెక్టర్ స్పందించారు. మంచి సూచన చేశారంటూ టీడబ్ల్యూజేఎఫ్ నేతలను అభినందించారు. అప్లికేషన్ చేసుకుని జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజాకు ఇస్తే ఆమె వాటిని పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశించిన పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వటం సముచితమన్నారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సూచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన జర్నలిస్టులకు రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జర్నలిస్టులు దరఖాస్తు చేసుకొని, అప్లికేషన్ నంబర్ టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు సమర్పిస్తే వారు ఆ వివరాలను అదనపు కలెక్టర్ కు అందజేస్తారన్నారు. రాజీవ్ యువ వికాసంలో ఎక్కువ మంది జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చేలా చూస్తామన్నారు. కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో

టీడబ్ల్యూజేఎఫ్, ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నేతలు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, కూరాకుల గోపీ, ఆవుల శ్రీనివాస్, వేగినాటి మాధవ్, షేక్ జానీపాష, మధుశ్రీ, దేవేందర్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, అర్షద్, గణేశ్, ఫయాజ్, జాకీర్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story