✕
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి

x
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే టేకులపల్లి మండలం బేతంపూడి కి చెందిన ఈర్ల భరత్ (19) హైదరాబాద్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
హైదరాబాద్ నుంచి ఇల్లందు వచ్చి బేతంపుడికి వెళ్తున్న క్రమంలో ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు.
ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో భరత్ మృతి చెందాడు.
ద్విచక్ర వాహనం పడి ఉండి గమనించిన పలువురు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యువకుడుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందిన భరతం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న భరత్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Ck News Tv
Next Story