లంచవతరమెత్తిన సి ఐ కానిస్టేబుల్

ఫ్రీగా వస్తున్నాయని మంది సొమ్ముకు ఆశ పడ్డ ముగ్గులు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు.
రూ.20 వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ఈ సంఘటన నారాయణ పేట జిల్లాలో కలకలం రేపింది. ఇంతకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్ నగర్‌కు చెందిన సంధ్యా వెంకట రాములు నారాయణపేట జిల్లా మక్తల్‌లో శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీని ఏర్పాటు చేశాడు. ఈయనపై పలు కేసులతోపాటు ఇటీవల కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ కేసులో హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది
దీంతో పోలీస్ స్టేషన్ రైటర్ నరసింహ సంధ్య వెంకటరమణతో మాట్లాడి రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఐ చంద్రశేఖర్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్ నరసింహ, శివ నిందితుడి నుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెయిడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. సీఐ కోసమే లంచం తీసుకున్నామని రైటర్ ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో చంద్రశేఖర్‌పైనా అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. బాధితుడి నుంచి తీసుకున్న రూ.20 వేల లంచం డబ్బులను రికవరీ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
