అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ
అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ

అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ
మహబూబ్‌నగర్ : వావివరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు.
తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ కమలాకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావేరమ్మపేట శివారు రాజీవ్‌నగర్‌కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.
అదే కాలనీలో ఉండే అల్లుడు వరుస అయ్యే మీనుగ రాజ్‌కుమార్‌తో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త కోటయ్య ఇద్దరిని మందలించాడు.
ఈ ఏడాది జనవరి 23న రాత్రి మీనుగ కోటయ్య కులస్తులతో కలిసి షాద్‌నగర్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాగా అలివేలు, రాజ్‌కుమార్ కాలనీలోని తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి నిలదీశాడు.
దీంతో విషయం అందరికి చెప్పి రచ్చ చేస్తాడని భావించిన నిందితులు మద్యం మత్తులో ఉన్న కోటయ్యను కింద పడేసి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అక్కడే పడుకోబెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
మరుసటి రోజు తన భర్త రాత్రి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగిరాలేడంటూ అలివేలు పిల్లలను నిద్రలేపి బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి వచ్చింది.
చలనం లేకుండా పడి ఉన్న భర్తను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తమ పెద్దనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు మీనుగ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది.
ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
