ఆధార్ కార్డు లేదని హాస్పిటల్ లో చేర్చుకొని సిబ్బంది

కదలలేని తల్లికి కూతురే దిక్కు...

ఆధార్ కార్డు లేదని హాస్పిటల్ లో చేర్చుకొని సిబ్బంది


అభం శుభం తెలియని ఓ చిన్నారి తన తల్లిని ఒడిలో పెట్టుకుని... రక్షించే వారికోసం దీనంగా దిక్కులు చూస్తోంది. ఈ చిత్రంలోని మహిళ పేరు ప్రమీల. మహబూబ్‌నగర్‌ జిల్లా మారేడుపల్లికి చెందిన ఈమె భర్త సురేష్‌ ఆరు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయారు. భర్త మృతి చెందిన నెల రోజులకు కుమారుడు చందు(9) రోడ్డు ప్రమాదంలో దూరమయ్యాడు. దిక్కుతోచని ఆ తల్లి ఆరేళ్ల కూతురు అనూషను వెంటబెట్టుకుని మహానగరానికి వచ్చింది. దొరికితే చిన్నపాటి కూలి పనులు చేస్తూ లేదంటే భిక్షాటనతో తమ రెండు ప్రాణాలను నిలుపుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ, విధి ఆమెను పరీక్షిస్తూనే ఉంది. అనారోగ్యంతో కదలలేని స్థితికి చేరింది. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్‌ కార్డు లేదని చేర్చుకోలేదు. ఇక ఎక్కడికీ వెళ్లే దారిలేక, పది రోజులుగా ఉస్మానియా ఆసుపత్రి బయటే కటికనేలపై ఇలా దీనావస్థలో పడి ఉంది. ఆసుపత్రి వద్ద దాతలు అందించే నాలుగు ముద్దలు పెట్టి... తల్లి ప్రాణాలను నిలిపేందుకు ఆ చిన్నారి అల్లాడుతోంది. అమ్మ కోలుకుంటుందో లేదో తెలియక, బిక్కుబిక్కుమంటూ ఆసుపత్రికి వచ్చిపోయే వారిని చేయిచాచి సాయం కోసం అర్థిస్తోంది. చిన్నారి దీనస్థితిని చూసి చలించిన ఓ వ్యక్తి తనను తీసుకెళ్లి స్నానం చేయించారని... ఉతికిన గౌను తొడిగి మళ్లీ తల్లిదగ్గరే వదిలేశారని స్థానికులు తెలిపారు.

Ck News Tv

Ck News Tv

Next Story