మెదక్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నూతన నిబంధనకు శ్రీకారం చుట్టారు

కలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనాలు రావాలంటే తప్పని సరిగా హెల్మెట్, కలెక్టర్ సరికొత్త నిర్ణయం

మెదక్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నూతన నిబంధనకు శ్రీకారం చుట్టారు.. మెదక్ జిల్లా కలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనాలు రావాలంటే తప్పని సరిగా హెల్మెట్, వాహన పత్రాలు ఉండాలన్న నిబంధనలు పెట్టి సిబ్బందితో గేటు వద్ద మంగళవారం వాహనాలను నిలిపి వేయించారు.

మెదక్ కలెక్టరేట్ లోకి ఇక నుంచి ద్విచక్ర వాహనాలు లోపలికి రావాలంటే హెల్మెట్ తో పాటు వాహనాల పత్రాలు ఉండాల్సిందే. లేదంటే సదరు వాహనాన్ని బయటే నిలిపి వేసి లోపలికి రావాల్సి ఉంటుంది.

నిబంధనలు పెట్టడమే కాకుండా ప్రధాన గేటు వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేయించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనాలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీనితో కలెక్టరేట్ కు వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి మరీ లోపలికి అనుమతించారు. హెల్మెట్ లేని వాహనాల యజమానులు బయటే ఆపి వేసి నడుచుకుంటూ వచ్చారు. కలెక్టరేట్ లోకి రావాలంటే ద్విచక్ర వాహన దారులకు తప్పనిసరిగా హెల్మెట్, వాహన పత్రాలు ఉండాలని పక్కగా నిబంధనలు పెట్టారు..

Ck News Tv

Ck News Tv

Next Story