షాద్ నగర్ నియోజక వర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం

మా తండాల్లో మా రాజ్యమే వచ్చింది..!

షాద్ నగర్ నియోజక వర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం

గిరిజన ఆదివాసి కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ శ్రీను నాయక్

షాద్ నగర్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.10 కోట్లు

గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మరో 20 కోట్ల నిధులతో అభివృద్ధి

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో తండాల్లో అభివృద్ధి

షాద్ నగర్ లో మీడియా సమావేశంలో గిరిజన ఆదివాసి కాంగ్రెస్ నాయకుల స్పష్ఠీకరణ

గత ప్రభుత్వం లంబాడీల సుదీర్ఘ పోరాటాలకు "మా తండాలో మా రాజ్యం" నినాదానికి తలవంచి

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చివరకు చిప్ప చేతికి ఇచ్చిందని, ఇప్పుడు మాతాండలో మా "కాంగ్రెస్ రాజ్యం" రాజ్యం వచ్చిందని తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని గిరిజన ఆదివాసి కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ శ్రీను నాయక్ ప్రకటించారు.

గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా చైర్మన్ శ్రీను నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెహ్రూ నాయక్, రూప్ల నాయక్, శ్రీనివాస్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొర్ర రవి నాయక్, బాసు నాయక్, రమేష్ నాయక్, మేఘ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఉద్దేశించి శ్రీను నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆయా తండాల రోడ్ల అభివృద్ధి కోసం నియోజకవర్గానికి 10 కోట్లు మంజూరయ్యాయని, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మరో 20 కోట్ల రూపాయలు మొత్తం 30 కోట్లు నియోజకవర్గం లోని ఆయా మండలాల్లో తండాల అభివృద్ధి మెరుగైన రోడ్ల సౌకర్యం కల్పించడానికి ఈ నిధుల ద్వారా కృషి జరుగుతుందని వివరించారు. ఈ నిధుల ద్వారా ఇప్పటికే చౌదరి కూడా ఫరూక్ నగర్ మండలం తదితర తండాల్లో రోడ్డు పనులు మొదలయ్యాయని గిరిజనులకి పెద్దపీట వేసి ఈ బాధ్యతలు గిరిజన ప్రజలకు అప్పజెప్పడం జరిగిందని అన్నారు. మా తండాలో మా రాజ్యం నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. గత పది ఏళ్లలో మాతాండలో మారాజ్యం ఉద్యమ నినాదానికి తలంచి తాండాలను గ్రామపంచాయతీలు చేసిన కెసిఆర్ ప్రభుత్వం అప్పటి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తండాలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. తాండాలను గ్రామపంచాయతీలు చేసి ఉండడానికి భవనాలు లేక కనీసం గిరిజన సర్పంచులు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని దౌర్భాగ్య పరిస్థితులు అనుభవించాలని అన్నారు. మా తండాలో మా రాజ్యం అంటే గత ప్రభుత్వం చేసిన అవమానాలైనా అని ఆయన ప్రశ్నించారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తాండాలకే ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని గత సర్కార్ లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న టి హరీష్ రావు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని తీవ్రంగా ఆరోపించారు. ఎస్సీ ఎస్టీల ప్రాంతాలు అభివృద్ధి కాకుండా గత ప్రభుత్వం పెద్దలు అడ్డుకున్నారని సబ్ నిధులను దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుకున్నారని అందుకే మాతాండాలో మా రాజ్యం లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు ఈ నిధుల పర్యవేక్షణతో పాటు చిత్తశుద్ధిగా ఈ నిధుల ఖర్చు పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిధులు పక్కాగా తండాలకు ఖర్చు పెట్టే విధంగా పర్యవేక్షణ జరుగుతుందని ఇది శుభ పరిణామమని శ్రీను నాయక్ తెలిపారు. తమ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గిరిజన తండాల మౌలిక సదుపాయాల రూపకల్పనకు తన వంతు సహకారం అందిస్తున్నారని, నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దాదాపు 30 కోట్లు వచ్చాయని వీటిని తగిన విధంగా ఖర్చు చేసి తాండాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు..

Admin

Admin

Next Story