విద్యుత్ వినియోగదారుల సదస్సు ను వినియోగించుకోండి


విద్యుత్ వినియోగదారుల సదస్సు ను వినియోగించుకోండి

విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ N V వేణుగోపాల చారి

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం, ఫిర్యాదుల స్వీకరణ కొరకై వెంకటాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మంగళవారం 4/3/2025 విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ NV వేణుగోపాల చారి తెలిపారు. ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చుట, నూతన సర్వీసులు మంజూరు, కేటగిరీల మార్పు మొదలగు వాటికి సంబంధించి విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరించబడతాయని తెలిపారు. కావున వాజేడు వెంకటాపురం మండలాల విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు.

Ck News Tv

Ck News Tv

Next Story