బెల్టు దుకాణం నిర్వహిస్తే రూ.లక్ష, తాగితే 20వేల జరిమానా...
![మందుబాబులను పట్టిస్తే 10 వేల నజరానా... మందుబాబులను పట్టిస్తే 10 వేల నజరానా...](https://cknewstv.in/h-upload/2025/02/13/1974925-photo6154582870270792285x.webp)
మందుబాబులను పట్టిస్తే 10 వేల నజరానా...
బెల్టు దుకాణం నిర్వహిస్తే రూ.లక్ష, తాగితే 20వేల జరిమానా...
నల్లగొండ జిల్లా ఏపూరులో నిర్ణయం...
మద్యం తాగి గ్రామంలో తిరిగేవారిని గుర్తించి సమాచారమిస్తే రూ.10 వేల నజరానా ఇస్తామని మహిళా సంఘం నేతలు ప్రకటించారు.
బుధవారం నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, ఏపూరులో మహిళలు, గ్రామస్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలో తక్షణమే బెల్టు దుకాణాలు మూసివేయాలని, సిగరెట్లు విక్రయించవద్దని డిమాండ్ చేశారు.
ఈ నెల 5న ఏపూరు యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 10న మృతి చెందాడు. ఈ ఘటన తమను ఎంతో కలిచివేసిందని మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రేతలకు రూ.లక్ష జరిమానా, మద్యం తాగిన వారికి రూ20వేల జరిమానా విధించనున్నట్లు గ్రామపంచాయతీ వద్ద గ్రామస్థులు నిర్ణయించారు.
మద్యం తాగిన వారిని పట్టిస్తే రూ.10వేల బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గ్రామంలో బెల్టుషాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)