
ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తా .. రాజీనామా వార్తలపై డీకే ఖండన
ర్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలను కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ ఖండించారు. ఇలా తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేసిన ఛానళ్ల పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.తనకు తన పార్టీ తల్లిలాంటిదని అన్నారు. ఈ పార్టీని నేను నిర్మించాను.. నా హైకమాండ్, నా ఎమ్మెల్యేలు, అంతా నా తోనే ఉన్నారు. అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
మొదట పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమైన ఆయన.. కొంత అసహనంగా కనిపించారు. ఇక సీఎం పదవిపై తన పట్టును ఆయన ఏ మాత్రం వీడినట్టు కనిపించలేదు. పైగా రొటేషనల్ ఫార్ములాను కూడా తిరస్కరించారు.
రేసులో తనకన్నా సిద్దరామయ్య ముందంజలో ఉన్నారని, ఆయననే పార్టీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయవచ్చునని వస్తున్న వార్తల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా సుమారు 90 మంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్య వెంటే ఉన్నట్టు కూడా మీడియా కోడై కూసింది.
మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర సీన్ లోకి వచ్చారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవి చేబట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన..పార్టీకి తను విధేయున్నీ అని ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించేందుకు సుముఖమేనని పేర్కొన్నారు. గతంలో కూడా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా, తరువాత డిప్యూటీ సీఎంగా వ్యవహరించానని గుర్తు చేశారు. పార్టీ అధిష్టానం తనను పిలిస్తే ఢిల్లీకి వెళ్తానని ఆయన చెప్పారు.