ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ

*దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.*
12 గంటల నుండి 3 గంటల మధ్య బయటకు రావద్దని, డీ హైడ్రేషన్ కాకుండా మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని, పిల్లలను పార్క్ చేసిన కార్లలో వదిలి వెళ్లరాదని, గొడుగు, లేదా క్యాప్ ధరించాలని, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, యూరిన్ పచ్చగా రావడం వడదెబ్బకు సంకేతాలంటూ కేంద్రం హెచ్చరించింది.
*వాతావరణ శాఖ కూడా అప్రమత్తత చేసింది*
3 నెలల పాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయన్న వాతావరణ శాఖ, ఈ సారి ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని, దేశంలోని అనేక ప్రాంతాల్లో మే 31 వరకూ వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో నమోదైన ఉష్ణోగ్రతల సగటు రికార్డ్ స్థాయిలో ఉందని, 1901 సంవత్సరం తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతల సగటు ఆ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారని, ఈ ఎండల తీవ్రత మనషులపైనే కాకుండా, పంటలపై కూడా ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.