కొడుకు, కోడలి తిక్క కుదిర్చాడు! కోటిన్నర విలువైన ఆస్తిని గవర్నర్‌కు రాసిచ్చిన తండ్రి

*కొడుకు, కోడలి తిక్క కుదిర్చాడు! కోటిన్నర విలువైన ఆస్తిని గవర్నర్‌కు రాసిచ్చిన తండ్రి*
పెంచి పెద్ద చేస్తారు.. ఎన్నో త్యాగాలు చేసి ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. తమ ఇష్టాలను చంపుకోని పిల్లల కోసమే బతుకుతారు.. పెళ్లీళ్లు చేస్తారు.. చేయిగలిగినదంతా చేస్తారు..
ఇంతలోనే వృద్ధాప్యం తరుముకోస్తుంది.. ఒకరి సాయం లేకుండా కదలలేని, తినలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు..? పిల్లల దగ్గర నుంచి కాసింత ప్రేమ.. కొంచెం సాయం..! ఆ తండ్రి కూడా వృద్ధాప్యంలో పిల్లలు అండగా ఉంటారని ఆశపడ్డారు. కానీ, అతని ఆశలు అడియాసలయ్యాయి. తన బాగోగులు చూసే వారెవరూ లేరు.. జీవిత చరమాంకంలో ఉన్న అతనికి కన్న కోడుకు, కోడల నుంచి ఏ మాత్రం ప్రేమా, సానుభుతి అందలేదు. అయితే అతని ఆస్తిపై మాత్రం వారిద్దరికి కన్ను ఉందని అతనికి తెలుసు.. కానీ.. ఆస్తి వాళ్లకు దక్కకూడదని ఆయన ఓ ప్లాన్ వేశారు.. ఇంతకీ ఏంటా ప్లాన్..? ఎక్కడ జరిగిందీ ఘటన..?
వృద్ధాశ్రమంలో నాథూ సింగ్:
ముజఫర్ నగర్‌ని బీరాల్ గ్రామానికి చెందిన సింగ్ ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఆయనకు కొడుకుతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తన సంతానంలో ఏ ఒక్కరికీ తన ఆస్తి వారసత్వంగా రావడం తనకు ఇష్టం లేదని, తాను మరణించిన తర్వాత ఆ స్థలంలో ప్రభుత్వం పాఠశాల లేదా ఆసుపత్రిని తెరవాలని కోరుతూ యూపీ గవర్నర్‌కు ఆస్తిని అప్పగించాలని అఫిడవిట్ దాఖలు చేశారు నాథూ సింగ్. ఈ 80 ఏళ్ల వృద్దుడికి సుమారు రూ.1.5 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. వాటన్నిటినీ రాష్ట్ర గవర్నర్‌క్ ఇచ్చేశాడు. నాథూ సింగ్ ఓ రైతు. తన కుమారుడు, కోడలు తనను సరిగా చూసుకోవడం లేదని, అందువల్ల వారు తన ఆస్తిని వారసత్వంగా పొందడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.
నన్ను ఎవరూ పట్టించుకోలేదు:
‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో కలిసి జీవించాల్సింది, కానీ వారు నన్ను సరిగా చూసుకోలేదు. అందుకే ఆ ఆస్తిని సక్రమంగా వినియోగించుకునేందుకు వీలుగా ఆ ఆస్తిని గవర్నర్‌కు బదలాయించాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు నాథూ సింగ్. వృద్ధాశ్రమం ఇంచార్జి రేఖా సింగ్ కూడా ఆదే విషయాన్ని స్పష్టం చేశారు. అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు రావడం కూడా నాథూ సింగ్‌కు ఇష్టం లేదట! నాథూసింగ్ అభ్యర్థనను నమోదు చేసినట్లు బుధానా తహసీల్ సబ్ రిజిస్ట్రార్ పంకజ్ జైన్ తెలిపారు. తన నివాస ఇల్లు, వ్యవసాయ భూమి, రూ.1.5 కోట్ల విలువైన స్థిరాస్తులను అఫిడవిల్‌లో పేర్కొన్నారు. ఆయన మరణానంతరం ఇది అమల్లోకి వస్తుందన్నారు.