ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన రాహుల్, యూపీ సీఎం, షారూఖ్, కోహ్లీ

ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన రాహుల్, యూపీ సీఎం, షారూఖ్, కోహ్లీ.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకునేందుకు కావాల్సిన అన్ని మార్గాలను వెతుకుతున్నాడు సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk). ఇప్పటికే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం సబ్ స్క్రిప్షన్ పెట్టగా..
లెగసీ అకౌంట్లకు (Legacy Accounts) వెరిఫైయిడ్ చెక్ మార్క్స్ (Verified Checkmarks) తీసేశాడు. వాటికోసం కూడా డబ్బులు కట్టాలని ట్విట్టర్ తెలిపింది. ఒకవేళ వెరిఫైడ్ చెక్ మార్క్ కావాలంటే ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటూ మస్క్ సలహా ఇచ్చాడు. ఒకవేళ ఆ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే వెబ్ ద్వారా అయితే నెలకు రూ.657.. iOS మరియు Androidలో యాప్ ద్వారా అయితే రూ.904 చెల్లించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 20 అంటే నిన్నటి నుంచే పలు సెలబ్రిటీ పర్సనల్ అకౌంట్లకు వెరిఫైయిడ్ టిక్ మార్క్ తీసేశారు.
ఆ వెరిఫైడ్ టిక్ కోల్పోయిన సెలబ్రిటీల్లో.. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్ మరియు సిఎం యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వంటి రాజకీయ నాయకులు.. విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాంటి ప్రముఖ క్రికెటర్లు.. పలువురు బి-టౌన్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వీరంతా వెరిఫైడ్ బ్లూ టిక్‌లను కోల్పోయారు. గతంలో బ్లూ టిక్ అంటే.. ప్రముఖలకి చెందినదిగా.. ఒరిజినల్ అకౌంట్‌గా.. తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడానికి ఒక మార్గంగా పనిచేసింది. అంతకుముందు ఏప్రిల్ 1 తర్వాత ట్విట్టర్‌లో బ్లూ టిక్ మార్క్‌ను పొందాలంటే ట్విట్టర్ బ్లూకు మెంబర్ షిప్ కొనుగోలు చేయడం తప్పనిసరి అంటూ ప్రకటించింది ట్విట్టర్.
ఫేక్ ఖాతాలను గుర్తించి యూజర్లకు సహాయపడటానికి ట్విటర్ తొలిసారిగా 2009లో బ్లూ టిక్ ఖాతాలను ప్రవేశపెట్టింది. అయితే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసే వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. అయితే గతేడాది ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేశాక.. ట్విటర్ బ్లూ టిక్ కలిగిన ఉన్న వారు ఛార్జీలు చెల్లించాలన్న విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఒకసారి గడువు ఇచ్చిన ఎలాన్ మస్క్..బ్లూ టిక్ మార్క్ కావాలనుకున్న వారు ఏప్రిల్ 20వ తేదీలోపు ఛార్జీలు చెల్లించాలని , లేదంటే ఏప్రిల్ 20 తర్వాత బ్లూ టిక్ మార్క్ కోల్పోతారని ముందే హెచ్చరించారు. ఇప్పుడు అనుకున్నంత పని చేశాడు.