రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దోషిగా తేలారు. ఈ మేరకు సూరత్ కోర్టు దోషి తీర్పు ఇచ్చింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై గుజరాత్ BJP ఎమ్మెల్యే రాహుల్పై పరువునష్టం కేసు వేశారు. విచారణ జరిపిన గుజరాత్లోని సూరత్ కోర్టు రాహులు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైల్ శిక్ష విధించడం షాక్ కు గురి చేసింది.
పరువు నష్టం కేసులు వేసి రాహుల్ గాంధీ ని రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు.
ఇలాంటి చర్యలకు భయపడేది లేదు..
దేశంలో, రాష్ట్రంలో అక్కడ బీజేపీ.ఇక్కడ బీఆర్ ఎస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి.
టీఎస్పీఎస్సి లో జరిగిన పేపర్ లీక్ ల కుంభకోణంలో నేను సాక్షి గా వెళుతున్న సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను, హౌస్ అరెస్టులు, గృహ నిర్బందాలు చేయడం ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి.
కేసీఆర్ ఖమ్మం, మహబూబా బాద్ జిల్లాలలో పర్యటించి పాడైన పంటలను పరిశీలించేందుకు వెళ్తుంటే ఆయా జిల్లాల నాయకులను అరెస్టులు చేశారు.
దేశంలో, రాష్ట్రంలో ఇంతటి నిర్బంధం ఏమిటి.. మనం ఎక్కడ ఉన్నాం.. ఇంతటి నియంత పాలనను ఎంతకాలం భరిద్దాం..
ప్రజాస్వామ్య విలువలు లేకుండా పాలన సాగుతున్న బీజేపీ, బీఆర్ ఎస్ లపై తిరగబడక తప్పదు..
రాహుల్ గాంధీ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల సభలో మాట్లాడిన ఒక రాజకీయ ప్రకటన ను ఆసరా చేసుకొని మోడీ ప్రభుత్వం ఆయనపై పరువు నష్టమ్ దావా వేసి కుట్రలు చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ కుటుంభం ఇలాంటి వాటికి భయపడదు.
సంపన్న కుటుంబం, విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి దేశం కోసం బ్రిటిష్ పైన పోరాటం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వేచ్ఛ తెచ్చిన కుటుంభం.. ఈ మోడీ లకు భయపడదు…
దేశం కోసం రాహుల్ గాంధీ తాత నెహ్రు పోరాటం చేసి జైల్ కు నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం దేహాన్ని ముక్కులు చేసిన భయపడలేదు..
అలాంటి రాహుల్ గాంధీ మోడీ బెదిరింపులకు భయపడదు..
రాహుల్ గాంధీ గారికి పరువు నష్టం కేసులో సూరత్ కోర్ట్ వేసిన రెండేళ్ల శిక్షపైన ఉన్నత కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తాం.
దేశం కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది.. రాహుల్ గాంధీ…