
Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..
2000 Notes withdrawn: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.
సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని, మే 23 నుంచి ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. ఆర్బీఐ చెప్పిన గడువు వరకు రూ. 2000 డినామినేషన్ చట్టబద్ధంగా చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ.. తక్షణం ఇప్పటి నుంచే అమలులోకి వచ్చేలా రూ.2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.