National

సీబీఐ కొత్త డైరెక్టర్ గా కర్ణాటక డీజీపీ

సీబీఐ కొత్త డైరెక్టర్ గా కర్ణాటక డీజీపీ

సీబీఐకి కొత్త డైరెక్టర్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు

కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐకి కొత్త డైరెక్టర్​ను నియమించింది కేంద్రం. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్​కు సీబీఐ నూతన డైరెక్టర్​గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వెల్లడించింది. ప్రస్తుత డైరెక్టర్​ సుబోధ్ కుమార్ జయస్​వాల్ స్థానంలో ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్రం వివరించింది. మే 25న జయస్​వాల్ పదవీ కాలం ముగుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


సీబీఐ డెరెక్టర్​ను ఎంపిక చేసే ప్యానల్​.. ప్రవీణ్ సూద్​ నియామకానికి ఆదివారం ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్యానల్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​, లోక్​సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.


సీబీఐ కొత్త డైరెక్టర్​ ప్రవీణ్ సూద్​.. 1986 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన అధికారి. గత మూడు సంవత్సరాలుగా ఆయన కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected