
హీరోయిన్ ఆదా శర్మకు యాక్సిడెంట్.. గాయాలు
హీరోయిన్ ఆదా శర్మ, ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తో సేన్కు యాక్సిడెంట్ అయింది. ముంబైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్కు వెళ్తుండగా వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో వారిద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇవాళ కరీంనగర్లో జరుగుతున్న హిందూ ఏక్తాయాత్రకు ఆదాశర్మ, సేన్ హాజరు కావాల్సి ఉండగా ప్రమాదం వల్ల రాలేకపోయినట్లు సేన్ ట్వీట్ చేశారు.
అయితే వీరు ఓ ఈవెంట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. కాగా, వీరు ఈ రోజు బీజేపీ కరీంనగర్ లో తలపెట్టిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండే. అయితే ప్రమాదం కారణంగా ఆ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోతున్నట్టు సినిమా డైరెక్టర్ సుదీప్తోసేన్ ట్వీట్ చేశారు.
కాగా, సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేక వివాదాల మధ్యే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ కూడా చేయడం జరిగింది. ఇక కర్ణాటక ఎన్నిలకలకు ముందు ఈ సినిమా రిలీజ్ కావడంతో రాజకీయంగా కూడా దుమారానికి ఈ సినిమా కేంద్ర బిందువైంది.