తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలు


తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రెవన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారిక పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం, ఉగాది తర్వాత వారం లేదా పది రోజుల్లో 55,418 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 58,868 పోస్టులను భర్తీ చేసిన ఈ ప్రభుత్వం, తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలతో కలిపి 57,924 పోస్టులను పూర్తి చేసింది.

ఆ పోస్టులకు నోటిఫికేషన్లు:

రాబోయే నోటిఫికేషన్లలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను కూడా చేర్చి భర్తీ చేయాలని సర్కారు ప్లాన్ చేస్తోంది.

మహిళా, శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి.

14,236 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. అదనంగా 228 పోస్టుల భర్తీకి కూడా ప్రణాళిక సిద్ధమవుతోంది.

గ్రూప్-1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. 15 నెలల్లో 61,579 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని రేవంత్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

జాబ్ క్యాలెండర్ ప్రకారం, 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేస్తే, మొత్తం 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తవుతుంది.

క్యాబినెట్ నిర్ణయం మేరకు జీపీఓ పేరుతో 10,954 పోస్టుల భర్తీకి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో వీఆర్వోలుగా పనిచేసి, ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న 6,000 మందిని జీపీఓలుగా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదనంగా 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి.

స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌లలో అవసరమైన పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక, న్యాయ శాఖలు, సచివాలయం, సమీకృత గురుకులాల్లో సుమారు 30,228 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

ఇందుకోసం ఆర్థిక శాఖతో చర్చలు జరిపిన అధికారులు, త్వరలో శాఖలవారీగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నిరుద్యోగ యువతకు ఉగాది నుంచి ఉద్యోగాల పండుగను అందించాలని రేవంత్ సర్కారు సంకల్పించింది.

ప్రభుత్వం ఖాళీల భర్తీకి సిద్ధమవుతోంది కాబట్టి.. నిరుద్యోగులు కూడా నోటిఫికేషన్లు రాగానే పరీక్షలు రాసేలా, ఇంటర్వ్యూలకు వెళ్లేలా ప్రిపేర్ అవ్వొచ్చు. ఆల్రెడీ ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్నవారూ ఉన్నారు. వారికి ఇదొక అవకాశం అనుకోవచ్చు. ఈసారి జాబ్ కొట్టి.. ఇంకా బెటర్ కావాలి అనుకుంటే.. దానికి ప్రయత్నించవచ్చు.

Ck News Tv

Ck News Tv

Next Story