గ్రూప్-2 మెయిన్ పరీక్షలు వాయిదా?
గ్రూప్-2 మెయిన్ పరీక్షలు వాయిదా?
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం జరగాల్సిన గ్రూపు-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలు చోట్ల అభ్యర్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. ప్రతిభావంతు లకు అన్యాయం జరగ కుండా చూడాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికోద్యోగుల కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి ముందుగానే రోస్టర్ పాయింట్లు నిర్ధారిం చారని... దీనివల్ల అన్ని కేటగిరీల్లోని ప్రతిభావంతు లైన జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నా రు.
రోస్టర్‌లో లోపాలు సరిచేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. రోస్టర్ విధానములో లోపాలు ఉన్నాయంటూ అభ్యర్థులు కొద్ది రోజులుగా చేస్తున్న విన్నపాలను పరిగణంలోకి తీసుకున్న కూటమి సర్కార్ స్పందించింది..
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్పీకి సూచించింది. సర్కార్ మరోవైపు ఎగ్జామ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
