సేఫ్ గా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్

సేఫ్ గా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్
అద్భుతమైన వీడియో మీ కోసం
వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత క్షేమంగా భూమికి తిరిగి వచ్చేశారు.
వీరిద్దరూ బుధవారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ 'ఫ్రీడమ్' క్యాప్సూల్‌లో సురక్షితంగా దిగారు. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన మిషన్ ముగిసింది.
ఫ్లోరిడా తీరంలో స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, దిగిన కచ్చితమైన క్షణాన్ని నాసా X (గతంలో ట్విట్టర్), యూట్యూబ్, NASA+లో లైవ్ కవరేజ్ ఇచ్చింది. విలియమ్స్, విల్మోర్‌తో పాటు స్పేస్‌ఎక్స్ క్రూ-9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.
డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకుని పారాచూట్‌లను తెరిచింది. తిరిగి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌకను స్థిరీకరించడానికి రెండు డ్రోగ్ పారాచూట్‌లు, ల్యాండింగ్‌కు ముందు వ్యోమనౌక వేగాన్ని మరింత తగ్గించడానికి నాలుగు ప్రధాన పారాచూట్‌లను అమర్చారు.
విలియమ్స్, విల్మోర్ మొదట జూన్ 5న బోయింగ్ యొక్క స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ISSకి చేరుకున్నారు. వారం పాటు ఉంటుందని మొదట అనుకున్నా, స్టార్‌లైనర్‌తో హీలియం లీక్‌లు, పనిచేయని రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్‌లతో సహా సాంకేతిక సమస్యలు రావడంతో వారు ఏకంగా 9 నెలలు ఉండాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2024లో, నాసా ఇతర మిషన్ల కోసం ISS డాకింగ్ పోర్ట్‌ను ఖాళీ చేస్తూ, మానవరహిత స్టార్‌లైనర్‌ను భూమికి పంపాలని నిర్ణయించింది.
విలియమ్స్, విల్మోర్ తిరిగి వచ్చే ప్రయాణాన్ని నాసా, స్పేస్‌ఎక్స్ వాతావరణం, ఫ్లోరిడా తీరంలో పరిస్థితులను అంచనా వేస్తూ పర్యవేక్షించాయి. అనుకూల పరిస్థితులు క్రూ-9 బృందం మంగళవారం ఉదయం 1:05 గంటలకు భూమికి 17 గంటల ప్రయాణాన్ని ప్రారంభించడానికి అనుమతించాయి.
ISSని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు, నిక్ హేగ్ అంతరిక్షంలో తన అనుభవాలను పంచుకుంటూ, "అంతరిక్ష కేంద్రాన్ని నా ఇల్లుగా పిలవడం, మానవత్వం కోసం పరిశోధనలు చేయడంలో నా వంతు పాత్ర పోషించడం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సహోద్యోగులతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభూతి. నా అంతరిక్ష ప్రయాణం చాలా వరకు ఊహించని విషయాలతో నిండి ఉంది." అని అన్నారు.
స్పేస్‌ఎక్స్ వ్యోమగాములను విజయవంతంగా తిరిగి తీసుకురావడం ఒక మైలురాయిగా భావిస్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా సాంకేతిక సమస్యల వల్ల కలిగిన ఆలస్యం, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌ను మిషన్‌ను వేగవంతం చేయమని కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భూమిపైకి వచ్చిన ఈ వ్యోమగాములు బృందం ప్రస్తుతం నాసా 45 రోజుల పోస్ట్-మిషన్ పునరావాస కార్యక్రమంలో పాల్గొంటుంది. ఇది వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం వల్ల కలిగే శారీరక ప్రభావాల నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది.
