*ఆమ్ ఆద్మీ పార్టీ కె మరోసారి ఢిల్లీ పట్టం*

*అన్ని ఎగ్జిట్ పోల్ వేరు కె కె ఎగ్జిట్ పోల్ వేరు*

డిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని 'కేకే' ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఆప్కు 39 సీట్లు, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటలు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

ఏపీలో ఎగ్జాక్ట్ గా చెప్పిన కేకే..

ఏపీ ఎన్నికల సమయంలో కేకే సర్వే చెప్పిన లెక్కలు నిజమయ్యాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. 175 నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమి 161 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. అధికార వైసీపీ కేవలం 14 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే తుది ఫలితాలు సైతం కేకే సర్వేకు చాలా దగ్గరగా వచ్చాయి.

టీడీపీ కూటమికి 164.. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కేకే సర్వే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సైతం మెజార్టీ సర్వేలు బీజేపీ వైపే మొగ్గు చూపినా.. కేకే సర్వే మాత్రం ఆప్ దే అధికారమని తేల్చి చెప్పింది. ఆప్కు 39 సీట్లు, బీజేపీకి 22 సీట్లు వస్తాయని తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. దీంతో కేకే సర్వే ఫలితాలు నిజం అవుతాయా? లేక రివర్స్ అవుతాయా? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

Admin

Admin

Next Story