ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలి

ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్


లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షులు &

ST సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కొఆర్డినేటర్ - రాజేష్ నాయక్

తేది:11-02-2025న సెక్రటేరియట్ లో “ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్”(గిరిజన సలహా మండలి) సమావేశం జరుగును. ఈ సమావేశంలో ఈ క్రింది పేర్కొన్న గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తున్నాము.

15-02-2025 రోజున లంబాడి ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుతాకు గతంలో మంజూరు చేసిన నిధులు సరిపోనందున, ఈ సంవత్సరం నిర్వహించబోయే సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి. సెలవు దినంగా ప్రకటించాలి.

ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ట్రైబల్ వెల్ఫేర్ G.O.Ms.No.18, తేది:16.07.2024 ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.

1996 PESA చట్టం అమలు ప్రకారం - స్థానికంగా గిరిజన అభ్యర్ధులతోనే 100% శాతం భర్తీ చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో - I.T.D.A. 29 శాఖలలో ప్రభుత్వ శాఖలలో 100% శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో ITDA, బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయాలి.

ఏజెన్సీ ప్రాంతంలో జోనల్ వ్యవస్థకు సంబంధించి ఇచ్చిన G.O.No.317 రద్దు చేయాలి.

గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.

మైదాన ప్రాంతంలో ST (గిరిజనులు) కోసం ప్రతి జిల్లా కేంద్రంలో I.T.D.A. ఏర్పాటు చేయాలి.

ST ల గ్రామపంచాయితీల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేయాలి.

ST ల కోసం ఏర్పాటు చేసిన సబ్ ప్లాన్ నిధులను గిరిజనుల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి.

పై అంశాలపై ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీర్మానాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నాము..

తెలంగాణ B. ED అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూక్య కుమార్. LHPS ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మోహన్ నాయక్. విద్యార్థి సంఘ నాయకులు సాయి నాయక్. నాగ. హతిరాం. ఆదివాసీ నాయకులు పవన్ కళ్యాణ్

Ck News Tv

Ck News Tv

Next Story