బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నా : ఎమ్మెల్యే రాజాసింగ్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు రాజా సింగ్.

ఇక భరించలేకపోతున్నా. పార్టీకి అవసరం లేదు వెళ్లిపో అని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా'' అని గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి ఆయన 'ఓ పత్రికతో' మాట్లాడారు. గోల్కొండ జిల్లా భాజపా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని సూచించగా, తాను సూచించిన పేర్లను పక్కనపెట్టి..

ఎంఐఎంతో తిరిగే వారికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ''పార్టీలోని కీలక నేతకు ఫోన్‌ చేసి ఇదే అడిగితే ఆ ఎన్నిక విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారు. ఆ జవాబుతో నాపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడింది. నేను ఇప్పటి వరకు భారాస, ఎంఐఎం, కాంగ్రెస్‌లతోనే యుద్ధం చేస్తూ వచ్చా.

సొంత పార్టీలోనూ యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడమనేది ప్రతి చోటా జరుగుతుంది. మరి ఇక్కడ నా సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలి'' అని డిమాండ్‌ చేశారు.

''నా జీవితంలో ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నా. ప్రస్తుతం పార్టీలో కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరిజం నేర్చుకోలేదు. వారి వల్లనే ఈ రోజు పార్టీ వెనుకబడింది. రాష్ట్రంలో ఎప్పుడో భాజపా ప్రభుత్వం రావాలి. కానీ ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ భాజపా ప్రభుత్వం రాదు'' అని వ్యాఖ్యానించారు.

Ck News Tv

Ck News Tv

Next Story