బెయిల్ ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యం

*బెయిల్ ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యం*

సినీ నటుడు పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali)ని గుంటూరు జడ్జ్ ఎదుట సీఐడీ పోలీసులు (CID Police) హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని గుంటూరు ( Guntur ) తరలించారు.

కర్నూలు జైలు నుంచి ఆయన్ని నేరుగా జీజీహెచ్‍కు తీసుకువచ్చిన సీఐడీ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జడ్జ్ ఇంటికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో పోసాని తరుఫున న్యాయవాదులు పొన్నవోలు, పోలూరి వెంకటరెడ్డి అక్కడికి చేరుకుని వాదనలు వినిపించారు.

మరోవైపు పోసానిని పరామర్శించేందుకు అంబటి రాంబాబు, వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. అందరం అండగా ఉన్నామని, ఆరోగ్యం ఎలా ఉందంటూ పోసానిని అంబటి వివరాలు అడిగారు. ఆరోగ్యం బాగానే ఉందంటూ పోసాని బదులిచ్చారు. అయితే కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని కన్నీరు పెట్టుకున్నారు. 70 ఏళ్ల వయస్స లో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలతోనే తనపై కేసులు పెట్టారంటూ బోరున విలపించారు. తప్పు చేస్తే నరికేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. రెండు ఆపరేషన్లు చేశారని, గుండెకు స్టంట్లు వేశారని చెప్పారు. తనకు భార్యాబిడ్డలు ఉన్నారని, రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుటే లాయర్లతో పోసాని అన్నారు.

కాగా, బాపట్లలో పోసాని కృష్ణమురళీపై మరో కేసు నమోదు అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు బాపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.

Updated On 13 March 2025 4:13 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story