మంత్రి శ్రీధర్ బాబు పర్యటన.. బీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నేతల మధ్య రగడ

మంత్రి శ్రీధర్ బాబు పర్యటన.. బీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నేతల మధ్య రగడ

ఉప్పల్ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన సందర్బంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది.

వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం.

అయితే, ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలో మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వర్గీయుల మీద కాంగ్రెస్ ఉప్పల్ ఇన్‌చార్జి పరమేశ్వర్ రెడ్డి వర్గీయులు దాడిచేసినట్లు తెలిసింది.

దీంతో ఇరువర్గాలు మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట జరిగినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగి పోలీసులు ఆ దాడిని అడ్డుకుని వారిని చెదరగొట్టినట్లు సమాచారం.

Ck News Tv

Ck News Tv

Next Story