బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు

బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది.

అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ''నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను'' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. విలీనం చేసా.. నన్ను విమర్శించిన వారిని ఎవరినీ వదిలిపెట్టాను. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదు.. అవినీతి విషయం లో అన్ని లెక్కలు తేలుస్తాం'' అంటూ విజయశాంతి హెచ్చరించారు.

''నేను కొత్త మనిషిలాగా ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు నేను సేవలు అందించాను. బీజేపీ, బీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే ఆ పార్టీని వదిలేశాను' అని విజయశాంతి చెప్పారు.

''ఎమ్మెల్సీగా మీ బండారం బయట పెడతానని భయం అవుతోందా?. నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు.

విజయశాంతికి తెలంగాణకి సంబంధం లేదా?. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కాబట్టి నేను బీజేపీకి వెళ్లాను. నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు.

తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేశాను. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో లేరు'' అని విజయశాంతి అన్నారు.

''కేసీఆర్ తన దొరబుద్ది నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా?. నింద వేయడం కాదు. నేను గట్స్ ఉన్న మహిళని. ప్రతిరోజూ నన్ను అవమానించారు. నన్ను హింసపెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు.

ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశాను. మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, కిషన్ రెడ్డి స్నేహితులు '' అని విజయశాంతి పేర్కొన్నారు.

కాపలా కుక్కలాగా తెలంగాణని కాపాడుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా అడగాలి. కేసీఆర్ మోసాలన్నీ బయటకి తీయాలి. కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది'' అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.

Ck News Tv

Ck News Tv

Next Story