*ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
*ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

*ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే దిశగా రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.
ధరణి స్థానంలో భూభారతి వెబ్ పోర్టల్‌ను అందుబాటు లోకి తీసుకురానున్నారు. అయితే, ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఈ పోర్టల్ ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, భూ భారతి చట్టం రూల్స్, ఎల్ఆర్ఎస్, తదితర విషయాలపై రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
మరోవైపు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి వేగం పుంజుకున్నదని, 25శాతం రాయితీ ఈ నెలాఖరుతో ముగుస్తుందని చెప్పారు. ఎల్ఆర్ఎస్ రాయితీకి సంబంధించిన గడువును మరింత పొడిగించే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయ్యాక సింగల్ కేసు కూడా మిస్ కాదని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకర ణకు ధ్రువీకరణ పత్రం ఇస్తుందని చెప్పారు.
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులపైన కూడా భూ భారతి చట్టం అమల్లోకి వచ్చాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. గ్రామ పాలన ఆఫీసర్ పాత వీఆర్వో, వీఆర్ఏలను తీసుకుంటామని, వారికి ఇంటర్ విద్యార్హతను నిర్ణయించనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం తెలుగులోనే ఎగ్జామ్ నిర్వహిస్తామని, పది వేల పోస్టుల్లో దాదాపు ఆరువేల మందికి పరీక్ష నిర్వహించే చాన్స్ ఉందని చెప్పారు.
