నేడు తెలంగాణ కు రాహుల్ గాంధీ

నేడు తెలంగాణ కు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రం ఐదున్నర గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

అక్కడి నుంచి చాపర్‌లో వరంగల్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం సుప్రభ హోటల్‌లో కొంత సేపు విశ్రాంతి తీసుకోనున్నారు.

ఆ తర్వాత ట్రైన్ లో స్టూడెంట్స్‌తో ప్రొగ్రాంకు ఆయన హాజరవుతున్నారు. అనంతరం వరంగల్ నుంచి సాయంత్రం ఏడున్నర గంటలకు రైలులో తమిళనాడు వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. బీసీ కులగణన,ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల రియాక్షన్ తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది.

అలాగే రైల్వేల ప్రయివేటీకరణ అంశంపై ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సడన్‌గా అగ్రనేత రావడంతో నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రెండు భారీ సభలు ఏర్పాటు చేస్తున్నామని రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించారు మహేష్ కుమార్. బీసీ కులగణన సభకు రాహుల్‌గాంధీ, ఎస్పీ వర్గీకరణ అంశంపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రావాలని కోరినట్టు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్‌కుమార్ చెప్పిన విషయం తెల్సిందే.

Ck News Tv

Ck News Tv

Next Story