తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
![తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు! తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!](https://cknewstv.in/h-upload/2025/02/10/1974444-n6514197831739199802221e670f3c3c566478c7cd34f15d30caa27b9fd66ed5c9ea00f6fd6731b3759a30c.webp)
తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన రిపోర్టు ఖరారైంది. 700 పేజీలతో కూడిన రిపోర్ట్ను డెడికేషన్ కమిషన్ చీప్ బూసాని వెంకటేశ్వర్లు సీఎస్ శాంతి కుమారికి అందించారు
ఈ నివేదిక ఆధారంగా గ్రామవార్డు నుంచి జడ్పీ చైర్మన్ దాకా సెగ్మెంట్లవారిగా రిజర్వేషన్లు పంచాయితీ రాజ్ శాఖ అమలు చేయనుంది.
రాష్ట్రాన్ని ఓ యూనిట్గా..
అయితే ఈ నివేదికను సీఎస్ శాంతకుమారీ బీసీ సంక్షేమ శాఖకు పంపనున్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గ్రామం ఒక యూనిట్గా వార్డు సభ్యుల రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోనున్నారు. మండలం ఒక యూనిట్గా ఎంపీటీసీల రిజర్వేషన్లు వర్తిస్తాయి.
జిల్లా ఒక యూనిట్గా జడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాష్ట్రాన్ని ఓ యూనిట్గా తీసుకుని జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయనుంది.
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)