ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు మావే: బండి సంజయ్

ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు మావే: బండి సంజయ్

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

నేడు నల్గొండ జిల్లా బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం

ఢిల్లీ ఫలితాల స్ఫూర్తితో బీజేపీని గెలిపించాలని శ్రేణులకు పిలుపు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ నల్గొండ జిల్లా బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీనే గెలుచుకుంటుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి కమిట్ మెంట్ తో పనిచేసే క్యాడర్ బీజేపీకే సొంతమని అన్నారు. ఢిల్లీ ఫలితాల స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని... ఆ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రో కో నడుస్తోందని ఆరోపించారు. వివిధ స్కాముల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ అంతర్గతంగా పనిచేస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలను ఎండగట్టాలని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు చెప్పాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం ప్రజలు వేచిచూస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులే దొరకడంలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేడంటేనే పరిస్థితి అర్థమవుతోందని అన్నారు. విద్యా వ్యవస్థను మొత్తం అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని బండి సంజయ్ విమర్శించారు. బీసీల లెక్క పెరగాలి కానీ, ఎలా తగ్గుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చామో చర్చకు తాము సిద్ధం అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Ck News Tv

Ck News Tv

Next Story