CM రేవంత్‌ను కలిసిన మరో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు
CM రేవంత్‌ను కలిసిన మరో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు

CM రేవంత్‌ను కలిసిన మరో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీ కీలక నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు కలిశారు.
శుక్రవారం సీఎం ఛాంబర్‌లో కుటుంబ సభ్యులతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపె కోసమే కలిసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు హరీష్ రావు, పద్మారావు గౌడ్‌లు కూడా సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించట్లేదని ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో దాదాపు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు.. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు.
రైతులకు మద్దతు ధర, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థినులకు స్కూటర్లు వంటి హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలం అయిందని ఆరోపించారు.
