HCU వివాదంపై స్పందించిన విజయ శాంతి

HCU వివాదంపై స్పందించిన విజయ శాంతి


HCU వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తాజాగా స్పందిస్తూ బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లోని 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజీ సంస్థకు 2004లో ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు కేటాయించడం తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం, సహేతుకం అని సైటైర్లు వేశారు.

ఐఎంజీ సంస్థ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా..ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం అనిపించలేదని.. ఎందుకంటే 2004లో బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడే ఐఎంజీ సంస్థకు చంద్రబాబు 400 ఎకరాల స్థలాన్ని బదలాయించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తు రాలేదని అన్నారు. ప్రస్తుతం ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ సీఎంలు కొట్లాడి.. వాటిని కాపాడటమే కాకుండా అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ తెలంగాణ బీజేపీ నేతలు నానా యాగి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

మరి 2004లో ఐఎంజీ సంస్థకు ఈ భూముల్ని అప్పచెప్పడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా? అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెలంగాణ సమాజం బీజేపీ నేతలను నిలదీస్తుంది అని విమర్శలు చేశారు.

Ck News Tv

Ck News Tv

Next Story