Politics

అతీక్ అహ్మద్ ను మించిన డేంజర్ కేసీఆర్

అతీక్ అహ్మద్ ను మించిన డేంజర్ కేసీఆర్

అతీక్ అహ్మద్ ను మించిన డేంజర్ కేసీఆర్

-పోలీసులను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నడు

-అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే…మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా?

-సచివాలయంలో నల్లపోచమ్మ గుడికి రెండున్నర గుంటల జాగా మాత్రమే ఇస్తారా?

-మసీదుకు మాత్రం 5 గుంటల జాగా ఇస్తారా?

-కేసీఆర్ కుటుంబానికి నెయ్యి… నిరుద్యోగులకు గొయ్యి.. రైతుల బతుకులను నుయ్యిలా మారుస్తారా?

-నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా?

-నేను పేపర్ లీక్ చేస్తే మీరేం పీకుతున్నారు?

-కేసీఆర్ కు డౌన్ ఫాల్ స్టార్టయ్యింది

-నాకు జైలు కొత్తకాదు… కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తాం

-సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందే… నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందే

-బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం

-ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం…

-పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం… ఉచిత విద్య, వైద్యం అందిస్తాం

-పాలమూరు ‘‘నిరుద్యోగ మార్చ్’’లో గర్జించిన బండి సంజయ్

• ‘‘మీకో విషయం తెలుసా… యూపీలోని గన్ పెట్టి బెదిరించి ప్రజలను దోచుకున్న గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ మీకు తెలుసు కదా?… వాడో ఫాల్తుగాడు. అంతకంటే డేంజర్ సీఎం కేసీఆర్… అతీక్ అహ్మద్ గన్ పెట్టి బెదిరించి దోచుకుంటే… కేసీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తూ ప్రజల భూములను, సొమ్మును దోచుకుంటున్నడు. గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ కేసీఆర్…అయినా భయపడే ప్రసక్తే లేదు. నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు కొట్లాడతూనే ఉంటాం’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు కారకులు కేసీఆర్ కుటుంబమేనన్నారు. ఆ కుటుంబ ప్రమేయంతోనే టీఎస్సీఎస్పీ పేపర్ లీక్ అయ్యిందన్నారు. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేదాకా, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా ఉద్యమాన్ని కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.

• నిరుద్యోగ మార్చ్ లో భాగంగా పాలమూరు వచ్చిన బండి సంజయ్ తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ‘‘నిరుద్యోగ మార్చ్’’ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది నిరుద్యోగులు బండి వెంట తరలివచ్చారు. వీరితో కలిసి కాషాయ జెండాలతో నిరుద్యోగులు కదం తొక్కడంతో పాలమూరు కాషాయ సంద్రమైంది. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన బండి సంజయ్ క్లాక్ టవర్ కు చేరుకుని ప్రసంగించారు.

• నిరుద్యోగ మార్చ్ లో బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, కోశాధికారి భండారి శాంతికుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, నాగూరావు నామోజీ, ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులు దరువు ఎల్లన్న, పుల్లారావు యాదవ్ తదితరులు.. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

• పాలమూరు బిడ్డలు చాలా గ్రేట్.. ఏం జోష్ ఉన్నదే… మీరంతా కలిసి ‘సాలు దొర – సెలవు దొర’ అని గర్జించండి.. (అనగానే అందరూ గట్టిగా నినాదాలు చేశారు).

• టీచర్ల పక్షాన 317 జీవోను సవరించాలని ఉద్యమించి జైలుకు పోయిన. టీచర్లంతా కేసీఆర్ పై కసితో తీర్పు ఇచ్చారు. ఇదే పాలమూరు గడ్డమీద నుండి క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా కేసీఆర్… నీకు కౌంట్ డౌన్ స్టార్టయ్యింది. పాలమూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది.

• నాకు జైలు కొత్తకాదు.. 9 సార్లు జైలుకు పోయిన. మొన్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంటే అర్దరాత్రి నన్ను అరెస్టు చేసి 8 గంటలు తిప్పారు. నన్ను ఎటు తీసుకుపోతున్నరో కూడా అర్ధం కాలేదు.. కానీ నేను భయపడలేదు. కానీ కేసీఆర్ ఫాంహౌజ్ దగ్గరకు పోగానే అక్కడ నిమ్మకాయలున్నయ్… కొంపదీసి నన్ను బలి ఇస్తారేమననే అనే అనుమానం వచ్చింది. అయినా భయపడలేదు. కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.

• తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యపై స్పందిస్తూ లాఠీ దెబ్బలు తింటూ జైలుకు పోయిన పార్టీ కార్యకర్తలు బీజేపీ వాళ్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం, కేసీఆర్ కుటుంబం ప్రమేయం వల్ల టీఎస్పీఎస్సీ పేపర్ లీకైంది. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేశారు.

• నన్ను ఎక్కడ అరెస్ట్ చేశారో… ఎక్కడ నా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారో అదే ఓరుగల్లు గడ్డపైనుండే నిరుద్యోగ మార్చ్ నిర్వహించి విజయవంతం చేసి పాలమూరు గడ్డకు వచ్చినం. ఇంతపెద్ద ఎత్తున తరలివచ్చిన మీ అందరికీ హ్యాట్సాఫ్..

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే. కేసీఆర్ కుటుంబం తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి భయమెందుకు? పేపర్ లీకేజీలో ప్రధాన కారకుడైన నీ కొడుకును మెడలు పట్టి కేబినెట్ నుండి గెంటెయ్. పేపర్ లీకేజీవల్ల నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలే.

• తినడానికి తిండి లేకపోయినా అప్పొసప్పో చేసి పిల్లలను చదివిస్తున్నరు. కోచింగ్ ఇప్పిస్తున్నరు. నిరుద్యోగులైతే ఒక్క పూట భోజనమే చేస్తున్నరు. అదే వాళ్లకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.

• పాలమూరుకు నీళ్లు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నడు. పాలమూరు పచ్చగైతది. అందరికీ ఉద్యోగాలొస్తయని చెప్పి ఓట్లు దండుకున్న కేసీఆర్ ఏం చేసిండు? మన బతకులు తట్ట మోసుకుని హైదరాబాద్ లో కూలీలుగా మారిపోతున్నయ్.

• ఎవరి కోసం తెలంగాణ సాధించుకున్నం? కేసీఆర్ కుటుంబం కోసమా? 21 నోటిఫికేషన్లు ఇచ్చినా ఒక్కటీ సక్సెస్ చేయలే. కావాలనే తప్పులు చేస్తూ కావాలనే కోర్టుకు వెళ్లేలా చేస్తూ పరీక్షలు వాయిదా వేస్తున్నరు. పరీక్షలు కూడా నిర్వహించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత?

• ఏ పేపర్ లీకైనా బండి సంజయ్ కారణమంట? మరి నేనే కారణమైతే నువ్వు పీకేదేముంది? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇస్తూ ప్రతినెలా 75 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తూ అపాయిట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇస్తోంది. మరి కేసీఆర్ కు ఎందుకు చేతగావడం లేదో సమాధానం చెప్పాలే.

• కేసీఆర్ కొడుకు ‘‘ఇద్దరు చేసిన తప్పిదమే పేపర్ లీకేజీకి కారణం’అన్నడు. మరి 50 మందిదాకా ఎందుకు అరెస్ట్ చేసినవ్? ఇయాళ సిగ్గు లేకుండా అహంకారం తలకెక్కి మదమెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నడు…

• కేసీఆర్… నీకు డౌన్ ఫాల్ స్టార్టయ్యింది. 30 లక్షల మంది నిరుద్యోగులతో కలిసి నీ కొడుకును బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తాం… సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేదాకా ఉద్యమిస్తాం… సిట్ విచారణ దండుగ.

• మీకో విషయం తెలుసా… యూపీలోని అతీక్ అహ్మద్ మీకు తెలుసా?… వాడో గ్యాంగ్ స్టర్.. వాడో ఫాల్తుగాడు. అంతకంటే డేంజర్ కేసీఆర్… వాడు గన్ పెట్టి బెదిరించి దోచుకుంటే… కేసీఆర్ పోలీసులను పెట్టుకని బెదిరిస్తూ భూములను, సొమ్మును దోచుకుంటున్నడు. గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ కేసీఆర్…అయినా భయపడే ప్రసక్తే లేదు. నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు కొట్లాడతూనే ఉంటాం.

• ఒకవైపు రైతులు అకాల వర్షాలతో నష్టపోయి బజారునపడి ఏడుస్తుంటే… ఇయాళ మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా డ్యాన్సులు చేస్తూ జల్సా చేస్తున్నరు. థూ.. రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం చేస్తానని మాట చెప్పి మోసం చేసిండు. ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని మేం డిమాండ్ చేస్తున్నం. మీరు దోచుకుంటున్న సొమ్మునుండి ఒక్క శాతం ఇచ్చినా రైతుల బతుకులు బాగుపడేవి.

• నిరుద్యోగుల పక్షాన మేం కొట్లాడుతుంటే… నాపై హిందీ పేపర్ లీక్ చేశారని అన్యాయంగా అరెస్ట్ చేశారు… నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కరీంనగర్ కార్యకర్తలు గంటసేపు పోలీసులకు చుక్కలు చూపించారు. అక్కడ స్టార్టయిన యుద్దం… హన్మకొండ పోయేదాకా అడుగడుగునా కొట్లాడిన వీరులు బీజేపీ కార్యకర్తలు…

• ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తారా? 21 మార్కులొస్తే పాస్ అవుతారు. అందులో 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు టీచర్లే వేస్తారు. ఒక్క మార్క్ కోసం లీక్ చేస్తాడా? ఎవడైనా? ఇదేమని ప్రశ్నిస్తే అహంకారంతో తలకెక్కి మాట్లాడుతున్నరు.

• కేసీఆర్ బిడ్డ కిలోల లెక్క నెయ్యి (డబ్బులృ తింటోంది) కేసీఆర్ కుటుంబానికి నెయ్యి… నిరుద్యోగులకు గొయ్యి… రైతులకు నుయ్యి మాదిరిగా తయారైంది.

• కొత్త సచివాలయం ఎట్లుంది? బీజేపీ అధికారంలోకి వచ్చినంక తెలంగాణ సంస్ర్కుతి సంప్రాదాయాలకు అనుగుణంగా మార్పులు చేస్తాం. సచివాలయంలోని నల్లపోచమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన వాళ్లకు మూడింది. అందుకే ఆయనకు డౌన్ ఫాల్ స్టార్టయ్యింది.

• ఇంకా దుర్మార్గమేందంటే… హిందువులను దారుణంగా మోసం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్… హిందూ సమాజం కోసం, 80 శాతం ఓట్లున్న హిందువుల కోసం మాట్లాడి తీరుతా… సెక్రటేరియట్ లో ధ్వంసమైన నల్లపోచమ్మ గుడికి ఇచ్చిన స్థలం రెండున్నర గుంటలు మాత్రమే… మరి అక్కడే మసీదుకు ఎంత ఇచ్చారో తెలుసా? 5 గుంటల జాగా… ఇదేందన్నా… తెలంగాణలో 80 శాతం ప్రజలున్న హిందువుల వాటా సెక్రటేరియట్ లో రెండున్నర గుంటలా? … 12 శాతమున్న ముస్లింల విలువ 5 గుంటలా? ఒక్కసారి ఆలోచించండి.. ఇది మాట్లాడటం తప్పయితే పక్కా మాట్లాడతా…

• నేను ఏ మతాన్ని కించపర్చను. కానీ హిందూ సమాజానాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నల్లపోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంగా మారుస్తాం. నల్లపోచమ్మ మహిమ ఏందో చూపిస్తాం.. నల్ల పోచమ్మను స్వర్ణ దేవాలయం కావాలని కోరుకునే వాళ్లంతా తెలంగాణలో బీజేపీ రామ రాజ్యం వచ్చేలా కొట్లాడండి. హిందువులను అడుగడుగునా అవమానిస్తున్నరు. ముస్లింలకు మతపరంగా 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఊరుకుందామా? బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్ల కాపీనీ చింపేసి చెత్తబుట్టలో వేస్తాం.

• జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక వర్గం వాళ్లు 57 సీట్లు గెలిచారు. హిందువుల గెలవాల్సిన చోట ఎంఐంఎం వాళ్లు గెలిచారు. అందుకే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అన్ని వర్గాల ప్రజలకు వాటిని అమలు చేస్తాం. ఇదే మాట అమిత్ షా చెప్పారు.

• బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ పాలనలో శిథిలావస్థకు చేరిన ఉస్మానియా వర్శిటీని పునర్నిర్మిస్తాం… కాకతీయ వర్శిటీ భవనాలను నిర్మిస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ ను ఏటా విడుదల చేస్తాం. పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకుంటాం.

• పాలమూరు గడ్డకు కాషాయ జెండాను పట్టుకుని జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, రబ్బర్ చెప్పులతో తరలివచ్చి నిరుద్యోగ మార్చ్ ను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected