
ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా సుఖేష్ మరో లేఖాస్త్రం..సీఎంపై సంచలన ఆరోపణలు
ukesh Vs Kavitha: తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) టార్గెట్ గా సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి లేఖాస్త్రాన్ని సంధించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సుఖేష్ ఈ లేఖ ద్వారా సంచలన ఆరోపణలు చేశారు. కవిత (MLC Kavitha) సెల్ కంపెనీల ఖాతాల నుంచి రూ.80 కోట్ల నిధులు మళ్లించినట్లు..ఈ నిధులను మారిషన్ కు మళ్లించినట్టు..దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఇక వాస్తవాలను బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని..ఈ వేధింపులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఇక త్వరలోనే నగదు బదిలీలపై కేజ్రీవాల్ (Kejriwal) చాట్స్ రిలీజ్ చేస్తానని లేఖలో సుఖేష్ పేర్కొన్నారు.
ఇక కేజ్రీవాల్ (Kejriwal) ఇంటి నిర్మాణంపై సుఖేష్ చంద్రశేఖర్ పలు ఆరోపణలు చేశాడు. కేజ్రీవాల్ ఇంటి ఫర్నీచర్ ఖర్చులను తానే భరించానని..దానికి సంబంధించిన బిల్లులు తన వద్ద ఉన్నాయన్నారు. త్వరలోనే కేజ్రీవాల్ కుష్ సంబంధించి మరో కుంభకోణాన్ని బయటపెడతానని అన్నాడు. కేజ్రీవాల్ (Kejriwal) సూచనలతోనే తాను రూ.80 కోట్లు బదిలీ చేశానని..ఆ డబ్బును క్రిప్టో కరెన్సీకి మార్చబడిందని అన్నారు. కాగా ఇప్పటికే పలుమార్లు తన లాయర్లతో లేఖలను బయటకు పంపించిన సుఖేష్ (Sukhesh) తాజాగా మరోసారి రిలీజ్ చేసిన లేఖ కలకలం రేపుతోంది.
గత లేఖలో ఇలా..
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖల పర్వం ఇంకా కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ సంచలన లేఖలతో పాటు చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇప్పటికే బయటపెట్టారు. తీహార్ క్లబ్ కు కవిత, కేజ్రీవాల్ కు స్వాగతమంటూ సుఖేష్ ఈ లేఖలో పేర్కొన్నాడు. ముందు కేజ్రీవాల్ ఆ తరువాత నీ వంతే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు. ట్విట్టర్ ద్వారా సమాధానం ఇవ్వవద్దని ఇవన్నీ కూడా పాత ట్రిక్కులని పేర్కొన్నాడు. తనను దొంగ, ఆర్ధిక నేరగాడిగా విమర్శిస్తున్నారని..కానీ అందులో మీరు భాగస్వాములే అని పేర్కొన్నాడు. దైర్యం ఉంటే సరైన రీతిలో సక్రమంగా విచారణకు సహకరించాలని కవితకు సవాల్ విసిరారు. కవితను ‘కవితక్క’ అని సంబోధించానని కానీ దేశం ప్రయోజనాల రీత్యా ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నానని సుఖేష్ పేర్కొన్నాడు.
‘కవిత పేరిట సేవ్ చేసుకుని చాట్ చేసిన 2 ఫోన్ నెంబర్ల స్క్రీన్ షాట్లను సుఖేష్ రిలీజ్ చేశాడు. అలాగే మరిన్ని వీడియో చెట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయన్న సుఖేష్ త్వరలోనే విడుదల చేస్తానని చెప్పాడు. ఇక తెలుగుభాషను సుఖేష్ ఎలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతల ప్రశ్నకు సుఖేష్ సమాధానం ఇచ్చాడు. తెలుగు (తండ్రి), తమిళం (అమ్మ) రెండూ మాతృభాషలే అని సుఖేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇంకా అనేక భాషలు మాట్లాడగలనని..తనను ఎవరో రాజకీయంగా ప్రభావితం చేస్తారన్న విమర్శలను కొట్టిపడేశాడు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని..అందుకే తాను నిర్దోషిగా బయటపడాలని అనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలనే ఈ వాస్తవాలను బయటపెడుతున్నట్లు పేర్కొన్నాడు. మీరు కూడా సీబీఐ, ఈడీ విచారణకు సహకరించాలని’ పేర్కొన్నాడు.
ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో వాట్సప్ , టెలిగ్రామ్ లో చాట్ చేసిన 700 పేజీల లేఖను సుఖేష్ రిలీజ్ చేశాడు. అందులో సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టు రూ.75 కోట్లను హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఏకే అనే వ్యక్తికి ఇచ్చానని పేర్కొన్నాడు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే తాను హైదరాబాద్ లోని BRS ఆఫీస్ వద్ద రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏకే అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఆ రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు. అయితే సుఖేష్ కేజ్రీవాల్ చాట్ ను బయటపెట్టిన కొన్నిరోజులకు ఎమ్మెల్సీ కవితతో చాట్ అంటూ సుఖేష్ లేఖతో పాటు చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేయడం ప్రకంపనలు సృష్టించగా..తాజా లేఖ మరింత హీట్ పెంచింది.