
కర్ణాటక కొత్త సీఎం ఖరారు – కాంగ్రెస్ నయా ఫార్ములా..!?
కర్ణాటక కొత్త సీఎం ఖరారు – కాంగ్రెస్ నయా ఫార్ములా..!?
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాంగ్రెస్ నుంచి కాబోమే ముఖ్యమంత్రి ఎవరు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఇద్దరు ముఖ్య నేతల పేర్లు రేసులో ఉన్నాయి. వీరిద్దరిలో హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది కీలకంగా మారనుందది. ఆదివారం గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ ఏర్పాటు చేసారు. సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.
అనూహ్య ఫలితాలు సాధించటంతో పార్టీ అధినాయకత్వం కొత్త సీఎంతో పాటుగా కొత్త ఫార్ములా సిద్దం చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ కొత్త సీఎం ఎవరు?
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు పాలనా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ 136 స్థానాలతో అంచనాలకు మించిన సీట్లు..ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇద్దరు నేతలు డీకే శివకుమార్.. మాజీ సీఎం సిద్దరామయ్య పేర్లు కొత్త సీఎం రేసులో ఉన్నారు. ఆదివారం కర్ణాటక కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం జరగనుందది.
కాంగ్రెస్ నాయకత్వం ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధినాయకత్వానికి సీఎం ఎంపిక బాధ్యతను అప్పగిస్తూ తీర్మానం చేయనున్నారు. దీంతో పార్టీ నాయకత్వం ఈ ఇద్దరిలో ఎవరిని సీఎం చేయాలనే నిర్ణయంతో పాటుగా కొత్త ఫార్ములా తెర మీదకు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇద్దరు నేతల మధ్య పోటీ:
సిద్దరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ మెజారిటీతో గెలిస్తే పార్టీకి సిద్ధరామయ్యే మొదటి ఛాయిస్ కావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. గతంలో సీఎంగా పని చేసిన సమయంలో అనేక పథకాలను ప్రారంభించారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ పైన ప్రభావం చూపించాయి. నిలబడతారు.
సిద్ధరామయ్య గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు లింగాయత్‌లలో అదే సమయంలో కొన్ని వర్గాలకు వ్యతిరేకమనే ప్రచారం సాగింది. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో డీకే శివకుమార్..సిద్దరామయ్య మధ్య కొంత గ్యాప్ కనిపించింది. ఇద్దరినీ కలిపే ప్రయత్నం స్వయంగా రాహుల్ తీసుకున్నారు. సీఎం అభ్యర్ది తానేనని సిద్దరామయ్య ఇచ్చిన సంకేతాలతో డీకే శివకుమార్ వర్గీయులు విభేదించారు.
సీఎల్పీ సమావేశంలో నిర్ణయం
ఇదే సమయంలో సిద్దరామయ్య ఎమోషనల్ పాలిటిక్స్ తెర మీదకు తీసుకొచ్చారు. ఇవే తన చివరి ఎన్నికలుగా ప్రచారం చేసారు. మరో వైపు డీకే శివకుమార్ వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని శివకుమార్ ఎప్పటి నుంచో కలగంటున్నారు. కర్ణాటకలో పార్టీ గెలుపు కోసం ఆర్థికంగా..రాజకీయంగా భూజానికెత్తుకున్నారు. కేంద్ర విచారణ సంస్థల సోదాలు…కేసులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత మద్దతు డీకేకు ఉందనే అభిప్రాయం ఉందది.
రానున్న పార్లమెంట్ ఎన్నికలు..బీజేపీకి ఎలాంటి అవకాశం రాష్ట్రంలో ఇవ్వకుండా ఉండాలంటే డీకేకు బాధ్యతు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. సీఎం పదవి పైన వ్యాఖ్యానించేందుకు డీకే నిరాకరించారు. తనకు ఎవరూ మద్దతు దారులు లేరని.. పార్టీనే తనకు మద్దతుగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ కొత్త ఫార్ములా:
ఈ సమయంలో జరగనున్న సీఎల్పీ మీటింగ్ లో అధినాయకత్వం ఒక ఫార్ములాతో ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నేతలు…వారి మద్దతు దారుల్లో విభేదాలు రాకుండా కొత్త ప్రతిపాదనకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇద్దరు నేతలకు సీఎం పదవిని చెరి సగం పంచుకొనేలా ..మంత్రివర్గంలో ఇద్దరి మద్దతు దారులుకు ప్రాధాన్యత దక్కించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. దీంతో.. ఆదివారం జరిగే సీఎల్పీ సమావేశంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని అధికారికంగా ఎంపిక చేయనున్నారు.