Politics

కాంటాక్ట్ కమిషన్లతో కేసీఆర్ వేలకోట్ల దోపిడి

*బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈసారి గెలవరు..!*

*బిజెపికి ఏడెనిమిది సీట్లు వస్తే మహా ఎక్కువ*

*షాద్ నగర్ మీడియా సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్*

*బిజెపి, బీఆర్ఎస్ తెర వెనుక ప్లాన్*

*వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రవాహమై సాగుతుందన్న మహేష్ గౌడ్*

*కాంటాక్ట్ కమిషన్లతో కేసీఆర్ వేలకోట్ల దోపిడి*

*చటాన్ పల్లిలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం*

షాద్ నగర్, సిటీటైమ్స్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు గెలవరని అదేవిధంగా బిజెపికి రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఎనిమిది సీట్లు వస్తే అదే మహా ఎక్కువ అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి ప్రాంతంలో స్థానిక పార్టీ ఇంచార్జ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చటాన్ పల్లి గ్రామంలో వీర్లపల్లి శంకర్, మహేష్ గౌడ్ తదితర కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి తిరిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని అన్నారు. గతంలో హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల మాదిరిగానే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 200 నుండి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.
కాంట్రాక్ కమిషన్లతో వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ప్రజలు ఆస్వాదించాలని టిఆర్ఎస్, బిజెపి ఇచ్చే డబ్బులను పెద్ద ఎత్తున తీసుకొని కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు భూదందాలతో కోట్లు సంపాదిస్తున్నారనీ వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎమ్మేల్యే కుడా గెలిచే అవకాశం లేదని అన్నారు.

*రాజకీయాలు కలుషితం చేసిన టిఆర్ఎస్*

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా కలుషితం చేసిన పాపం కేసీఆర్ దని మహేష్ గౌడ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అనేక పద్ధతులతో ఖూనీ చేశారని ఆయన విమర్శించారు. నిరంకుశ పాలనతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అన్నారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని అన్నారు. ప్రతి పౌరుడిపై రెండు లక్షల బాకీ ఉందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ 120 లక్షల కోట్ల రూపాయలలో 50వేల కోట్ల కమిషన్లు దండుకున్నారని అన్నారు.

*బిజేపి వెనుకే బీఆర్ఎస్*

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని మహేష్ గౌడ్ ఆరోపించారు. అంతర్గత ఒప్పందాలతో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి అంత సీన్ లేదని, కేవలం ఏడు లేక ఎనిమిది సీట్లు గెలిస్తే అదే మహా గొప్ప అనీ ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ బిజెపి దోస్తీ వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలపడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రజల ముఖాల్లో కాంగ్రెస్ పార్టీని చూసి వారి కళ్ళలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. టిఆర్ఎస్ కబంధహస్తాల నుండి ప్రజలను కాంగ్రెస్ పార్టీ విముక్తి చేస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ సీటుతో సహా అన్ని నియోజకవర్గాల్లో విజయ డంక ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వీర్లపల్లి శంకర్, చెన్నయ్య, బాబర్ ఖాన్, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్, మసూద్ ఖాన్, రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చంది తిరుపతి రెడ్డి, బాలరాజ్ గౌడ్, కృష్ణారెడ్డి, నరసింహ యాదవ్, పురుషోత్తం రెడ్డి, కొమ్ము కృష్ణ, సీతారాం, అశోక్, సత్తయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected