Politics
గవర్నర్ పై ఫైర్ అయిన మంత్రి సత్యవతి

గవర్నర్ పై మంత్రి సత్యవతి గరంగరం
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లేఖపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ కేఎంసీ నివేదిక అడగడంపై మంత్రి సత్యవతి స్పందించారు. గవర్నర్ కు అనుమానాలుంటే ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా అని ప్రశ్నించారు.
కొత్త సాంప్రదాయాలు అనుసరించడం ఎందుకని అన్నారు. ఒక డాక్టర్ గా ఎలా వ్యవహరించవచ్చో గవర్నర్ కు తెలియదా అని అన్నారు. దీని కోసం లేఖలు రాయడం ఎందుకు అని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మెరుగైన వైద్యం కోసమే ప్రీతిని నిమ్స్ కు తరలించామన్నారు. దీనిపై గవర్నర్ వింత ప్రశ్నలు వేయడం ఎందుకని అన్నారు.