KhammamPolitics

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి.

—వైరా నియోజకవర్గ టి.పి.సి.సి. సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రం లోని పాపకొల్లు క్రాస్ రోడ్ నందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కెసిఆర్ మరియు కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసిన జూలూరుపాడు మండల కాంగ్రెస్ కమిటీ.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ మాట్లాడుతూ—
ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థపాలనలో ఎవరు బాగుపడలేదని, గత ఎనిమిది సంవత్సరాల నుండి ఏ ఒక్క ఉద్యోగ ప్రకటన ఇవ్వకపోగా, ఎట్టకేలకి ఇచ్చినట్టే ఇచ్చి ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదని, ఎన్నో ఆత్మ బలిదానాలతో ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది కేసీఆర్ కేటీఆర్ కుటుంబం కోసమా, పరీక్షలన్నీ రద్దు చేశాము, కేవలం 200 రూపాయల అప్లికేషన్ ఫీజు లేదని ప్రకటించిన కేటీఆర్, ఎన్నో సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లల్లో కొన్ని వేల లక్షల రూపాయల ఫీజులు కడుతూ ఎంతో కష్టపడి చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును 200 రూపాయలతో నువ్వు కొనగలవా కేటీఆర్ అని ప్రశ్నిస్తూ, ప్రభుత్వాన్ని పాలించడం చేతకాని మీరు, ప్రజల మీద రైతుల మీద విద్యార్థుల మీద గౌరవం లేని మీరు తక్షణమే రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ, యావత్ తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, మండల సీనియర్ నాయకులు గోసు రామారావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వాంకుడోత్ కిషన్ నాయక్, జూలూరుపాడు గ్రామ పంచాయతీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాసరావు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గూగులోత్ శ్రీనివాసరావు, భానోత్ మంగు నాయక్, మండల ఎస్సీ సెల్ నాయకులు కొమ్ము రవి, గూగులోత్ శ్రీను నాయక్, గూగులోత్ బాలాజీ నాయక్, మండల మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే ముస్తఫా, బాదావత్ సామ్యా నాయక్, నరుకుల ఆదినారాయణ, పోగుల శ్రీను, సదా నాగయ్య, హనుమంతు, రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected