పలు కుటుంబాలను పరామర్శించిన టిపిసిసి సభ్యులు రాంమ్మూర్తి నాయక్.

పలు కుటుంబాలను పరామర్శించిన టిపిసిసి సభ్యులు రాంమ్మూర్తి నాయక్.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన బానోత్ హరిలాల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు శ్రీ ధరావత్ రాంమ్మూర్తి నాయక్ గారు ఈరోజు హరిలాల్ స్వగృహానికి చేరుకుని వారిని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు.
అనంతరం ఇమామ్ నగర్ గ్రామానికి చెందిన లకావత్ రవి నిన్న రోడ్ యాక్సిడెంట్ కి గురై చనిపోగా వారి స్వగృహానికి చేరుకుని వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
బురదరాగాపురం గ్రామానికి చెందిన బానోత్ రవి ఇటీవలే మరణించగా వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రేపల్లెవాడ మాజీ సర్పంచ్ మాలోత్ నరసింహరావు, బురదరాగాపురం ఉపసర్పంచ్ రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీతయ్య, రవిలాల్, సాగర్, ఏన్కూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు రవి, నరేష్, వీరు మరియు తదితరులు పాల్గొన్నారు.