EducationPolitics

పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి

పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి

– మాజీ ఎంపీ పొంగులేటి డిమాండ్

– గ్రూప్ -1 లీకేజీ వ్యవహారం మరవకముందే టెన్త్ పేపర్ లీకేజీ ఘటన బాధాకరం

– విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

– వెంటనే బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం

చింతకాని పర్యటన లో భాగంగా టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం పై మాట్లాడిన మాజీ ఎంపీ పొంగులేటి

చింతకాని : గ్రూప్ -1 పేపర్ లీకేజీ వ్యవహారం మరవకముందే టెన్త్ పేపర్ లీకేజీ ఘటన జరగడం దురదృష్టకరం…. బాధాకరమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చింతకాని పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల జీవితాలను ఇబ్బందులోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

సంఘటన జరిగినప్పుడల్లా కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ఉన్నతాధికారులతో పాటు దీనికి కారకులైన బాధ్యులపై చట్ట రీత్యా తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీకేజీల వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులకు సిట్ నోటీసులు జారీచేయడం కాదని, చిత్తశుద్ది ఉంటే కారుకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected