Politics

బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల తెలంగాణ చేసిండు

బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల తెలంగాణ చేసిండు

బంగారు తెలంగాణ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసిండు

తెలంగాణ సంపదను దోచుకుంటున్న ప్రభుత్వ పెద్దలు

కోరి తెచ్చుకున్న తెలంగాణలో కోటి సమస్యలతో తల్లడిల్లుతున్న ప్రజలు

తెలంగాణలో టిఆర్ఎస్ పాలన వద్దని ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుతున్న ప్రజలు

ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం, ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఉండటానికి బిజెపి, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగమే ఎమ్మెల్యే ఈటెల వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై బురదజల్లే విధంగా ఈటెల రాజేంద్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న

కాంగ్రెస్ ప్రజల పార్టి. ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది

నీతి నిజాయితీగా ఉండే కాంగ్రెస్ పార్టీకి మీకున్న అలవాట్లు రుద్దడాన్ని ఖండిస్తున్న

కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడానికి సిగ్గుండాలి

ప్రగతిశీల భావవాజాలమని చెప్పుకున్న ఈటెల రాజేందర్ బిజెపికి
వెళ్లడం చెప్పిన దానికి, చేసే దానికి పొంతన లేదు అని తేలిపోయింది.

కేసీఆర్ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో
రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా ముఖ్య భూమిక పోషించిన
ఈటెల రాజేందర్
కేసీఆర్ చేసిన దోపిడీలో భాగస్వామి అవుతాడు.

బిఆర్ఎస్ పరిపాలన దోపిడీలో ఈటెల రాజేందర్ కూడా వాటాదారుడే

బిఆర్ఎస్ దోపిడీ చేస్తుందని ఆరోపణలు చేస్తున్న ఈటెల రాజేందర్ చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యధారాలు ఇవ్వాలి కదా? ఎందుకు ఇవ్వటం లేదు.

తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించడానికి రాజకీయంగా బతకడం కోసం బిజెపి, బిఆర్ఎస్ ఆడుతున్న నాటకం ఇది

అర్ధరాత్రి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం, కార్యకర్తలు హడావిడి చేయడం, రాత్రంతా కోర్టులో చర్చ పెట్టడం, బెయిల్ ఇవ్వడం పెద్ద హంగామా చేసి మీడియాలో చూపించడం ప్రజా సమస్యలు బయటకు రాకుండా ప్రజల దృష్టిని మళ్లించడంలో భాగమే

బండి సంజయ్ ను అర్ధరాత్రి అరెస్టు చేయాల్సినంత సీరియస్ విషయం ఏవైనా ఉన్నదా?

రాజకీయంగా బిఆర్ఎస్, బిజెపి లు హైప్ క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టి క్రోనీ క్యాపిటలిస్టులకు దేశ సంపదను బిజెపి దోచిపెడుతుంటే… తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేయడమే ఎజెండాగా వ్యవహరిస్తున్నారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉద్యోగాలను కొల్లగొడుతున్నాడు.

రాష్ట్రంలో వరి కోతల కోసి పది రోజులవుతున్న కొనే దిక్కు లేకపోవడం విచారకరం

అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు, తడిసిన ధాన్యానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి

ఈదురు గాలులకు నష్టపోయిన మొక్కజొన్న పంటకు అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టం అంచనా వేయాలి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ దోపిడీ చేసిన సొమ్మును కక్కిస్తాం. సమగ్ర విచారణ చేయిస్తాం. కక్కించిన సొమ్మును దేశానికి అంకితం చేస్తాం

వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది

తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే నెరవేరుతాయి

కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని పార్టీల ఆధీనంలో ఉన్న మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారం

టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రకటిస్తాం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తాం

వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడిలో సగం పెట్టుబడిని కలిపి గిట్టుబాటు ధరగా నిర్ణయించి పంట కొనుగోలు చేస్తాం

5 లక్షలు ఆర్థిక సాయం చేస్తాం ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం పునరుద్ధరణ చేస్తాం

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఇంట్లో ఉన్న ఇద్దరికీ ఫించన్ పంపిణీ చేస్తాం

ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

మీడియా సమావేశంలో డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, ఫక్రుద్దీన్, కొత్త కురుమ శివకుమార్, సత్యం తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected