బండి సంజయ్ కు బెయిల్

బండి సంజయ్ కు బెయిల్
టెన్త్ పరీక్ష పత్రాల కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ లభించింది. బీజేపీ లీగల్ సెల్ సంజయ్ తరపున హన్మకొండలో బెయిల్ పిటషన్ దాఖలు చేసింది. దీనిపై దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఇద్దరు వ్యక్తుల హామీ, రూ. 20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శుక్రవారం విడుదల కానున్నారు.
.
మీడియా స్క్రోలింగ్ పాయింట్స్….
• న్యాయం గెలిచింది…. ప్రజాస్వామ్యం గెలిచింది.
• నిరుద్యోగుల, విద్యార్థులతోపాటు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బెయిల్ లభించడం ప్రజాస్వామ్య విజయం.
• అక్రమంగా, అకారణంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని భావించిన బీఆర్ఎస్ సర్కార్ కు కోర్టు ఉత్తర్వులు చెంప పెట్టు.
• అరెస్టులు, కేసులు, జైళ్లతో బండి సంజయ్ సహా బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరు…
• టీఎస్పీఎస్పీ లీకేజీపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిగే వరకు, మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసే వరకు, పరీక్షల రద్దు నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం అందేవరకు బండి సంజయ్ పోరాటం కొనసాగుతుంది.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి