బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం సమీక్ష సమావేశంలో భట్టి

హాత్ సే హాట్ జోడో సమీక్ష సమావేశం
గాంధీభవన్ @హైదరాబాద్…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి ఠాక్రే హాజరు
*సీఏల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్*
బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయి.
ప్రజల సొమ్మును కొద్ది మంది పెద్దలకే బీజేపీ పంచి పెట్టిన విషయాన్ని భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు ప్రజలకు చాటి చెప్పారు
దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తున్నది.
అదానీకి ప్రధాని మోదీ పంచిన సొమ్ముపై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది.
మండల్, బ్లాక్ స్థాయిలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి ఇంటింటికి వెళ్లి రాహుల్ సందేశాన్ని ప్రచారం చేయాలి
బీఆర్‌ఎస్ పాలన ప్రమాదకరంగా మారింది…
కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు తిన్నరు. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదు.
ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తరు? ఒక్క కాల్వ, డిస్ట్రిబ్యూటరీలు లేవు..
కృష్ణా నదిపై పాలమూరు తప్ప కొత్త ప్రాజెక్టేది? అన్నీ కాంగ్రెస్ కట్టినవే.
కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్‌లో భూముల రేట్లు పెరిగాయి..కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తున్నది.
24 గంటల కరెంట్ ఇస్తున్నమని గొప్పలు చెప్పడం మాని కరెంట్ ఇవ్వాలి
- కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే కరెంట్ ఉత్పత్తి
సాధ్యమైతున్నది. బీఆర్‌ఎస్ కట్టిన కొత్త ప్రాజెక్టు ఓక్కటి లేదు.