
తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి k. చంద్రశేఖర్ రావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం 10 వేల మంది విద్యార్థులు ప్రణ త్యాగం చేసి సాధించుకున్న కలల రాష్ట్రంలో , వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం ఐన 9 ఏళ్ళ తర్వాత TSPSC ఇచ్చిన ఉద్యోగ నోటిికేషన్లు అన్నీ పేపర్ లీకేజీ అవ్వడంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ IT సెక్యూరిటీ లో విఫలం ఐన కేటీఆర్, నిర్లక్ష్యం వహించిన TSPSC చైర్మన్ ఇద్దరు వెంటనే రాజీనామా చేయాలి. IT శాఖా మంత్రిని కేబినెట్ నుండి తక్షణం భర్తరఫ్ చేసి, TSPSC Board ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు, వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి ఉద్యోగ అవకాశం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు కట్టి శిక్షణ తిస్కున్న విద్యార్థుల భవిష్యత్తు పేపర్ లీకేజిలతో రాష్ట్ర ప్రభుత్వం సర్వ నాశనం చేసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షులు శ్రీ ధరావత్ బాల్ సన్ నాయక్ గారు డిమాండ్ చేస్తూ అదే విధంగా ఇప్పటి వరకు TSPSCలో ధరకాస్తు చేసుకున్న ప్రతీ విద్యార్థికి 2 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించి వాయో పరిమితి ఇంకో రెండేళ్లు పెంచాలని కోరారు . ఇట్టి నష్ట పరిహారాన్ని చెల్లించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇట్లు
ధరావత బాల్ సన్ నాయక్
భాజపా గిరిజన మొర్చ అధ్యక్షులు, సూర్యాపేట జిల్లా.
Cell:9493403409