Politics

TSPSC లీకేజీ పై బిగుస్తున్న ఉచ్చు

టీఎస్పీఎస్సీ లీకేజీపై సుప్రీంసహా హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు

ప్రధాన కోచింగ్ సెంటర్ల వద్ద పబ్లిక్ హియరింగ్ నిర్వహించండి

కేటీఆర్ ను బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ఉద్యమించాల్సిందే

చిన్న తప్పు లేకుండా కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది

రాష్ఱ్ర ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోందనే అంశాన్ని ప్రజల్లో ఎండగట్టండి

టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో బండి సంజయ్

టీఎస్పీఎస్సీ లీకేజీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిసహా హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీని ఆదేశించారు. అట్లాగే ‘‘చిన్న పొరపాటు లేకుండా కేంద్రం లక్షలాది ఉద్యోగాలను క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మరి కేసీఆర్ ఫ్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోంది. ఇదే అంశాన్ని విస్త్రంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు.

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దీంతోపాటు పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ సమావేశమయ్యారు.

• ఈ సమావేశానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్పీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కరుణా గోపాల్ పాల్గొన్నారు.

• ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లుడతూ త్వరలోనే వివిధ కోచింగ్ సెంటర్లతోపాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లోనూ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. దీంతోపాటు టీఎస్పీఎస్సీ లీకేజీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన, న్యాయమూర్తులకు లేఖ రాయాలని కోరారు.

నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీతో బండి సంజయ్ భేటీ

• ఈ సమావేశానంతరం డాక్టర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ సభ్యులతో బండి సంజయ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే అంశంపై కార్యాచరణను వెంటనే రూపొందించాలని ఆదేశించారు. అందులో భాగంగా వారం రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మందితో ‘‘నిరుద్యోగ మార్చ్’’ నిర్వహించాలని నిర్ణయించినందుకు వెంటనే ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్‘‘ తేదీలను కూడా రెండ్రోజుల్లో ఖరారు చేయాలని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected