ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి

*గురక పోతుంది అనుకుంటే ప్రాణం పోయింది*
*ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి*
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గురక వస్తుందని ఆసుపత్రిలో చూపించుకుంటే నయమవుతుందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలపడంతో గురకకు చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేసి ఆయన ప్రాణం తీశారు.
బంధువుల కథనం ప్రకారం కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన వెల్దురి శ్రీనివాస్ తరచూ గురక సమస్య వస్తుండంతో చికిత్స తీసుకుంటే తగ్గుతుందని కుటుంబ సభ్యులు తెలపడంతో సంగారెడ్డిలోని పద్మావతి న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి బుధవారం మధ్యాహ్నం వచ్చారు. ఆయనను పరీక్షించిన సంగారెడ్డిలోని పద్మావతి న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ముక్కులో బోను పెరిగింది ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని తెలిపారు.
ఇంత చిన్న విషయానికి ఆపరేషన్ చేయడమెందుకని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలపగా లేదు ఆపరేషన్ చేస్తే గురక సమస్య తగ్గుతుందని భరోసా కల్పించారు. కాగా ఆసుపత్రి వైద్యులు బుధవారం ముక్కులో బోనుకు ఆపరేషన్ చేశారు. అయితే రాత్రి 2.00 గంటలకు శ్రీనివాస్ చనిపోయారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా చనిపోతాడని ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా పేషంట్ కు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా చనిపోతారని బంధువులు ఆరోపించారు. మద్యాహ్నం జాయినైతే రాత్రి 2 గంటలకు చనిపోయాడని ఆసుపత్రి యాజమాన్యం తెలుపడంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా చనిపోతారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
గురక సమస్య ఉందని వస్తే ప్రాణాలు తీశారు..
రాత్రి పడుకునే సమయంలో తరచూ గురక సమస్య వస్తుందని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని శ్రీనివాస్ కు తెలపడంతో గురక సమస్యనే కదా చూపించుకుంటే తగ్గిపోతుందని నమ్మి సంగారెడ్డిలోని పద్మావతి ఆసుపత్రికి వెళ్లారు. ముక్కులో బోను పెరిగింది ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని కుటుంబ సభ్యులను నమ్మించి శ్రీనివాస్ కు ఆపరేషన్ చేసిన వైద్యులు శ్రీనివాస్ నిండు ప్రాణం తీశారు. సంగారెడ్డిలోని పద్మావతి న్యూరో మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు తరుచుగా జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడం వల్లే రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రాణాలు తీసిన పద్మావతి ఆసుపత్రి పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
