Sports
ముంబైపై బెంగళూరు గ్రాండ్ విక్టరీ

ముంబైపై బెంగళూరు గ్రాండ్ విక్టరీ
ముంబైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 8వికెట్ల తేడాతో
ఘన విజయం సాధించింది. 172 రన్స్ లక్ష్యంతో బరిలో
దిగిన బెంగళూరు ఓపెనర్లు ఆది నుంచే దూకుడుగా
ఆడారు. కోహ్లి 49 బంతుల్లో 82 రన్స్ చేయగా, డూప్లెసిస్
43 బంతుల్లో 73 రన్స్ చేశారు. వీరిద్దరూ ముంబై బౌలర్లపై
ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ తొలి వికెట్కు 148
రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో RCB 16.2
ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.