Sports

11 పరుగులకే 6 వికెట్లు.. 88 పరుగుల ఆధిక్యం

11 పరుగులకే 6 వికెట్లు.. 88 పరుగుల ఆధిక్యం.. ఇండోర్‌లో స్పిన్ మాయాజాలం..

డోర్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్‌పై 88 పరుగుల ఆధిక్యం సాధించింది.

భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇక తొలి రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 156 పరుగులకు ముగించిన ఆసీస్.. రెండో రోజు 41 పరుగులు జోడించి చివరి 6 వికెట్లు కోల్పోయింది.

తొలిరోజు రవీంద్ర జడేజా ఒక్కడే ఆస్ట్రేలియాపై 4 వికెట్లు తీయగా.. రెండో రోజు అశ్విన్, ఉమేష్ యాదవ్ కలిసి కంగారూలను బెంబేలెత్తించారు. ఆ ఇద్దరూ కలిసి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మొదట అశ్విన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను, ఆ తర్వాత ఉమేష్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా కామెరూన్ గ్రీన్‌ను ఔట్ చేశారు. అనంతరం మిచెల్ స్టార్క్‌ను ఉమేష్ యాదవ్ బౌల్డ్ చేయగా.. అశ్విన్ ఎల్బీడబ్ల్యూతో అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చాడు. అలాగే చివరి రెండు వికెట్లను సైతం ఈ ఇద్దరు బౌలర్లు పంచుకోవడం విశేషం. మరోవైపు ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయి.. 88 పరుగుల ఆధిక్యం సాధించింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు కనీసం 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇస్తే.. కచ్చితంగా విజయం మనదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected