ఇద్దరు ఆర్‌ఐల సస్పెన్షన్

ఇద్దరు ఆర్‌ఐల సస్పెన్షన్
సూర్యాపేట జిల్లా మోతె మండల తహసీల్దార్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఆర్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆర్‌ఐలు రికార్డులను ట్యాంపర్ చేసినట్టు తేలడంతో చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మండలానికి చెందిన 11 మంది పాత పహాణీల్లో పేర్లు లేకపోయినా తమకు భూములున్నట్టు గతంలో అప్లై చేసుకున్నారు.
దీంతో ఆర్‌ఐలు ఎస్‌కే.మన్సూర్ అలీ, జైనిర్మలా దేవి కలిసి రికార్డులను ట్యాంపర్ చేసి, అప్లై చేసుకున్న వారి పేర్లు ధరణిలో నమోదయ్యేలా తప్పుడు ధ్రువీకరణ చేశారు.
