తండ్రికి జీవిత ఖైదు శిక్ష.. పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని కూతురి రోదన

తండ్రికి జీవిత ఖైదు శిక్ష.. పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని కూతురి రోదన

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్లగొండ కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఏ2 సుభాష్ శర్మ కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించారు.ఈ కేసులో మారుతి రావు తముడు శ్రవణ్ ఏ6గా ఉన్నారు. దీంతో ఆయనకు ఈ తీర్పులో జీవిత ఖైదు చేశారు. ఈ తీర్పు విన్న ఆయన భార్య, కుమార్తె కోర్టుకు చేరుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తండ్రికి జీవిత ఖైదు విదించారనే బాధలో ఆయన కుమార్తె కోర్టు ఆవరణలో కన్నీటి పర్యంతం అయ్యారు.

తన తండ్రి తప్పు చేయలేదని.. అమృత తండ్రి చేసిన పనికి మా నాన్నకు శిక్ష విధించారని వాపోయారు. మా నాన్న తప్పు చేయలేదు అన్యాయంగా మా నాన్నకు శిక్ష వేశారని.. నేను కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని రోదించింది.

ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పులో మాకు న్యాయం జరుగలేదని.. మీడియా నే మా నాన్నను దోషిని చేసిందని .. కనీసం మా నాన్నను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆ యువతి కన్నీటి పర్యంతం అయింది.

Ck News Tv

Ck News Tv

Next Story